ఎస్‌ఐఆర్‌లో తన వివరాలను నమోదు చేసుకున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…

కామారెడ్డి పట్టణంలోని తన నివాసంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా తన ఓటరు వివరాలను నమోదు చేసుకున్నారు.
ఇంచార్జ్ అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ,
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి ఓటు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం అధికార యంత్రాంగంపై ఉందన్నారు.
అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా, అలాగే అనర్హమైన లేదా డూప్లికేట్ ఓట్లు జాబితాల్లో కొనసాగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, బీఎల్‌ఏలు (బూత్ లెవల్ ఏజెంట్లు) బీఎల్‌వోలు (బూత్ లెవల్ అధికారులు) పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు జాబితాలను పరిశీలించాలని సూచించారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు, యువతి ఓటరుగా నమోదు కావడానికి అవసరమైన సహాయాన్ని అందించాలని కోరారు.
అలాగే ఒక వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదై ఉంటే అలాంటి డూప్లికేట్ నమోదులను గుర్తించి తొలగించే ప్రక్రియకు సహకరించాలని అన్నారు.
అదే సమయంలో నిజమైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఓటరు జాబితాల నిర్వహణపై ప్రజాస్వామ్య వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని అన్నారు.
ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం కలిగేలా అన్ని చర్యలు పారదర్శకంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు సమాన విలువ కలిగి ఉంటుందని, ఓటు హక్కును కాపాడటం ప్రతి రాజకీయ పార్టీతో పాటు ప్రతి పౌరుడి బాధ్యతగా ఉండాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాలు, వార్డులు, బూత్‌ల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఓటరు జాబితాలను పరిశీలించాలన్నారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడాలి అని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే ప్రతి ఓటు రక్షించబడాలి. అదే సమయంలో డూప్లికేట్ అనర్హ ఓట్లను తొలగించడం ద్వారా ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాలి” అని షబ్బీర్ అలీ అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


