మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి …
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ఎస్పీ రాజేష్ చంద్ర ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 25 (అఖండ భూమి న్యూస్)
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం కామారెడ్డి జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లా పరిపాలన, పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ, జిల్లా సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీలో అధికారులు, పోలీసు సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొని మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచారు.
అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తుకు మూలస్తంభమని, మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం, దేశ అభివృద్ధిని కూడా దెబ్బతీస్తుందని తెలిపారు. విద్యార్థులు, యువత తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు.
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ చంద్ర మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు నిరంతర నిఘా కొనసాగుతోందని చెప్పారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు పోలీసు శాఖకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
సమాజ సహకారంతోనే మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా కామారెడ్డిని తీర్చిదిద్దగలమని పేర్కొన్నారు.
కార్యక్రమం ముగింపులో మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, వాటి నిర్మూలనకు కృషి చేయాలని అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరి, జిల్లా సంక్షేమ అధికారి కుమారి ఐ. ప్రసన్న, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు, పోలీసు అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది , ఇతర అధికారులు పాల్గొన్నారు.
You may also like
ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…


