కాచాపూర్ లో గంగమ్మ దేవి కళ్యాణం ,బోనాల సమర్పణ …

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 26 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో శ్రీ గంగాదేవి దేవాలయం ప్రతిష్టాపర మహోత్సవం ఉత్సవాలులో భాగంగా శుక్రవారం ఘనంగా గంగాదేవి కళ్యాణం, అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఊరేగింపు, మంటప ప్రసాద మంత్రపుష్పం, తీర్థ ప్రసాద 26న బోనాల ఊరేగించుట, కళ్యాణం నిర్వహించారు.ఈ ఐదు రోజులు జరిగే విగ్రహ ప్రతిష్ట , ప్రథమ వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో ఆలయం కు వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాద విధాన నిర్వహించారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గంగాపుత్ర సదర సంఘం వారు భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తానికి గ్రామంలో గంగమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారు తమ కోరికలను తీర్చాలని భక్తులు అమ్మవారికి వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో గంగాపుత్ర సంఘం అధ్యక్షుడు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి స్వామి, సాగర సంగం సభ్యులు లక్ష్మీనరసింలు, గౌట శంకర్, గంగాపుత్ర సుదర్శన సభ్యులు పాల్గొన్నారు.


