ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ చంద్ర …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 27 (అఖండ భూమి న్యూస్);
ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు వారి లక్ష్యాలకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో జిల్లా పరిపాలన ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.
ఈ సందర్బంగా శనివారం ఆర్‌జీయూకేటీ (బాసర్)లో విద్యను అభ్యసిస్తున్న కామారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిని నిఖిత కుటుంబ ఆర్థిక పరిస్థితులను వివరించి విద్యా ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం కోరుతూ సమర్పించిన వినతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్పందించారు..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తన కార్యాలయంలో విద్యార్థినికి రూ.10,000 విలువైన చెక్కును
రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అందజేశారు.
ఈ సహాయం పుస్తకాలు, అధ్యయన సామగ్రి, ప్రయాణం తదితర విద్యా అవసరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు.
విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలో నిలిపివేయకుండా, పట్టుదలతో ఉన్నత విద్యను కొనసాగించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.
విద్యార్థిని నిఖిత జిల్లా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ఆర్థిక సహాయం తన చదువును కొనసాగించేందుకు ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు రాజన్న, నరసింహులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


