హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో కుండపోత…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 27 (అఖండ భూమి న్యూస్);
హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం నమోదైంది. ముఖ్యంగా గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కొండాపూర్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో రహదారులపై నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, షేక్‌పేట, మణికొండ, పంజాగుట్ట, మెహదీపట్నం, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, మలక్‌పేట, బేగంపేట, సోమాజిగూడ, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు, ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


