గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్ … 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 27 (అఖండ భూమి న్యూస్);
గౌడ్స్ అఫీషియల్ & ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షునిగా మాందాపూర్ గ్రామానికి చెందిన అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం రోజున జిల్లా కేంద్రంలో జరిగిన గోపా జిల్లా సర్వసభ్య సమావేశంలో నూతన జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ. గోపా వేదికగా గౌడ కులస్థుల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. నిరుపేద గౌడ విద్యార్థులకు విద్యా సహాయం అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు ‘ప్రతిభా పురస్కారాలు’ అందించడం వంటి కార్యక్రమాలను గోపా నిర్వహిస్తుందని యువతకు ఉపాధి కల్పించడం గోపా లక్ష్యమని ఆయన అన్నారు. గౌడ కులస్తుల అభివృద్ధికి , ఐక్యతకు సహకారం అందించే దిశగా సమాజ సేవలో మరింత చురుకుగా పనిచేసే అవకాశం లభించిందన్నారు. గోపా లో సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికీ సుప్రజ హాస్పిటల్ సహకారంతో హెల్త్ కార్డ్ లు రాష్ట్ర కమిటీ అందిస్తుందన్నారు. నా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన గోపా రాష్ట కమిటీకి,గోపా సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


