దోమకొండ గురుకుల పాఠశాలలో తనిఖీ చేసిన జిల్లా ప్రత్యేక అధికారి , కలెక్టర్..

దోమకొండ గురుకుల పాఠశాలలో తనిఖీ చేసిన జిల్లా ప్రత్యేక అధికారి , కలెక్టర్...

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 27 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను జిల్లా ప్రత్యేక అధికారి విజయేంద్ర , జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మిక తనిఖీ శనివారం నిర్వహించారు.

దోమకొండ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ప్రత్యేక అధికారి, కలెక్టర్.

ఈ సందర్భంగా

విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ పాఠశాలలో విద్య, వసతి, ఆహారం, ఇతర సౌకర్యాలపై ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

వారి సమస్యలు, విద్యాభ్యాసం, వసతి, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు.

విద్యార్థినులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు (హెల్త్ చెకప్‌లు) నిర్వహిస్తున్నారా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉండే నేపథ్యంలో ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా దోమతెరలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే, విద్యార్థులందరికీ యూనిఫాంలు అందజేశారా అని ఆరా తీశారు. యూనిఫాం వస్త్రం అందిన వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా కొలతలు తీసి కుట్టించి విద్యార్థులకు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నాయా అనే విషయాన్ని తెలుసుకుంటూ, అలాంటి ఘటనలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

విద్యార్థులు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని సూచించారు.

భోజనం చేస్తున్న విద్యార్థినులకు పోషకాహారం ప్రాముఖ్యతను వివరిస్తూ, అన్నం తక్కువగా, కూరలు, ఆకుకూరలు, పప్పు, గుడ్లు వంటి పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. వడ్డించిన కూరలను పూర్తిగా తినాలని, ఆహారాన్ని వృథా చేయకూడదని చెప్పారు.

విద్యార్థులు భోజనం చేసే సమయంలో ఉపాధ్యాయులు, వార్డెన్లు ప్రత్యేకంగా పర్యవేక్షించి ప్రతి విద్యార్థి సరైన మోతాదులో పోషకాహారం తీసుకునేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వసతి, మెరుగైన విద్యా వాతావరణం, అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!