కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ…

“కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 28 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లాలోని అర్హులైన ఐదేళ్లలోపు 1,03,678 మంది చిన్నారులందరికీ 100 శాతం పోలియో చుక్కలు వేయాలి – ఒక్క చిన్నారి కూడా మిగిలిపోరాదు

కామారెడ్డి, జూన్ 28: జాతీయ పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రత్యేక అధికారి, జాయింట్ డైరెక్టర్ డా. వెంకటరమణ గారు ఆదివారం కామారెడ్డి జిల్లాను సందర్శించారు.

ఈ సందర్భంగా బికనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పల్స్ పోలియో బూత్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం చిన్నారికి పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా డా. వెంకటరమణ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలో పోలియో చుక్కలకు అర్హులైన ఐదేళ్లలోపు మొత్తం 1,03,678 మంది చిన్నారులు ఉన్నారని, వారందరికీ 100 శాతం పల్స్ పోలియో చుక్కలు వేయడం ఆరోగ్య శాఖ మనందరి ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకుండా ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, ఎం.పీ.హెచ్.ఏలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు.

అనంతరం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. జె.వెంకటి గారు మాట్లాడుతూ జిల్లాలోని ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయాలని అలాగే రెండవ, మూడవ రోజు ఆశా కార్యకర్తలు, అంగన్వాడీకార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటి సందర్శన చేసి ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఎవరైనా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోయారా అని ఆరా తీసి ఎవరైనా ఐదు సంవత్సరాల లోపు పిల్లలు పోలియో చుక్కలు వేయించుకోకుండా ఉంటే పోలియో రెండు చుక్కలు వేసి అనంతరం ప్రతి ఇంటికి ఎక్స్ (ఎక్స్ ) (పి ) మార్క్ తప్పకుండా వేయాలని ఆదేశించారు. అలాగే ఇటుక బట్టీలు, ఫ్యాక్టరీలు, మైగ్రేషన్ ప్రజలు, ప్రాజెక్టులు లాంటి ప్రత్యేక ప్రాంతాలను సందర్శించి అక్కడ ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నారా లేరా కనుగొని ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయాల్సిందిగా ఆదేశించారు. మరియు పోలియో నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొంటూ, తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రోహిత్ కుమార్,చలపతి,వైద్య అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!