హిందూ విద్యార్థులపై మతమార్పిడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 29 (అఖండ భూమి న్యూస్);
హిందూ విద్యార్థులపై మతమార్పిడి చేస్తే సహించేది లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. సోమవారం
కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించి సందర్భంగా మాట్లాడారు.
ఆర్మూర్ లో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ లు అనవసరంగా మతం రంగు రుద్దుతున్నారు అని ఆరోపించారు.
పెర్కిట్ గ్రామంలో స్కూల్లో హిందూ హిందూ విద్యార్థులపై మత మార్పిడి చేసేందుకు ఖురాన్ చదివించడం, నమాజ్ చేయడం నేర్పిస్తున్నారు అని ఆరోపించారు.
ప్రిన్సిపల్ ఇమ్రాన్ ఖాన్ ఐ ఎస్ ఐ తో సంబందాలు ఉన్నాయనీ అన్నారు.
తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా నమాజ్ చేయించడం నిబంధనలకు విరుద్ధమని నిబంధనలకు విరుద్ధమని అన్నారు.
విదేశీ సంస్థ శక్తుల నుండి నిధులతో హిందువుల ను మత మార్పిడీలు చేయాలని కుట్ర పన్నుతున్నారు అని అన్నారు.
హైదరాబాద్ నుండి కొందరు గుండాలు ఆర్మూర్ లో కి వచ్చి గొడవలు చేయలని చూస్తున్నారు అని ఆరోపించారు.
ముస్లింలు ప్రశాంతంగా ఉండండి..
ఇద్దరి మందిలో జరిగిన గొడవ. అనవసరంగా పెద్దది చేయాలని చూస్తున్నారు అని అన్నారు.
ముస్లింలు పెద్దలకు వినతి సంఘ విద్రోహ శక్తులు గొడవలు పెట్టాలను చూస్తాయి ఇది గమనించాలని అన్నారు.
ఆర్మూర్ లాంటి ప్రాంతాల్లో హిందువులు, ముస్లిం లు కలిసి గొడవపై కూర్చుండి సామరస్యంగా మాట్లాడుకుందాం అని అన్నారు.
ఆర్మూర్ ప్రజలకు విన్నపం హిందూ ముస్లిం ఆవేశాలకు పోకుండా అన్న తమ్ముళ్లుగా ఉందామనీ అన్నారు.
మతం ముసుగు తొడిగి ఎం ఐ ఎం గొడవలు పెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ఆరోపించారు.
ప్రశాంత నియోజకవర్గంలో కలహాలు సృష్టించాలని చూడడం విడ్డూరంగా ఉందని అన్నారు. దీనిని బిజెపి ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, నరేందర్ రెడ్డి, కౌన్సిలర్ లు , బిజెపి నాయకులు పాల్గొన్నారు.
You may also like
దేమే కలాన్ లో రూ.20 కోట్లతో దేమే కలాన్ పిడబ్ల్యూఓ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనుమతులు లేని విద్యా సంస్థలను వెంటనే మూసివేయాలి…
లడఖ్‌లోని కైగర్ రి పర్వతాన్ని అధిరోహించిన విద్యార్థినిని సన్మానించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ …
ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ…
ముత్యంపేటలో మద్యపాన నిషేధం…


