ముత్యంపేటలో మద్యపాన నిషేధం…
ప్రజల కోరిక మేరకు గ్రామంలో మద్యం నిషేధం..
దోమకొండ ఎక్సైజ్ సీఐ, సివిల్ పోలీస్ స్టేషన్లలో గ్రామస్తుల ఫిర్యాదు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 29 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట్ గ్రామంలో గ్రామస్తుల ఐక్యవేదికతో మద్యపాన నిషేధం కు గ్రామస్తులు కట్టుబడి సోమవారం నిషేధం విధించారు. గ్రామంలో మద్యపానం నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ అదే గ్రామానికి చెందిన పలువురు నిరుపేదలు, రైతులు, కూలీలు మద్యంకు బానిసలై కుటుంబ కలహాలు సృష్టిస్తూ ఆర్థికంగా కుదేలైతున్నట్లు తెలిపారు. గ్రామస్తుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో అందరి కోరిక మేరకు గ్రామపంచాయతీ పాలకవర్గంతో పాటు ఐక్యవేదికగా ఏర్పడి మద్యపానం నిషేధం కు సంతకాలు చేశారు. అనంతరం దోమకొండ ఎక్సైజ్ సీఐ, సివిల్ పోలీస్ స్టేషన్లో కార్యాలయలలో మద్యపానం నిషేధం చేస్తూ బెల్ట్ షాపుల నిర్వాహనకు అనుమతులు ఇవ్వకుండా చూడాలని అధికారులను కోరుతూ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముత్యంపేట్ గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


