ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 29 (అఖండ భూమి న్యూస్);
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 101 దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా భూ సమస్యలు, విద్యాశాఖ, రెవెన్యూ, పింఛన్లు, సంక్షేమ పథకాలు, గృహాలు, ఉపాధి, విద్యుత్, మున్సిపల్,వ్యవసాయం సదరం క్యాంపులు, తదితర శాఖలకు సంబంధించిన వినతులను ప్రజలు సమర్పించారు.
ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల మేరకు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్ వి గిరి, జడ్పీ సీఈఓ చందర్, జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


