లడఖ్‌లోని కైగర్ రి పర్వతాన్ని అధిరోహించిన విద్యార్థినిని సన్మానించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ …

లడఖ్‌లోని కైగర్ రి పర్వతాన్ని అధిరోహించిన విద్యార్థినిని సన్మానించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ …

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 29 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థి విస్లావత్ బన్నీ లడఖ్ ప్రాంతంలోని 6,100 మీటర్ల ఎత్తైన కైగర్ రి (కైగర్ రీ) పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించి విశేష ప్రతిభ కనబరిచాడు.

బన్నీ జూన్ 14న పర్వతారోహణను ప్రారంభించి, జూన్ 19 ఉదయం 8 గంటలకు శిఖరాన్ని చేరుకున్నాడు. శిఖరంపై భారత జాతీయ త్రివర్ణ పతాకంతో పాటు తెలంగాణ గిరిజన సంక్షేమ విద్యాసంస్థల సొసైటీ (టి టి డబ్ల్యూ ఈ ఐఎస్) కళాశాల ఫ్లెక్సీని ప్రదర్శించి తన దేశభక్తిని, కళాశాలపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లాపూర్ తండాకు చెందిన ఇస్లావత్ బన్నీ గతంలో కిలిమంజారో, కాంగ్ యత్సే పర్వతాలను కూడా అధిరోహించి తన సత్తా చాటుకున్నాడు.

వ్యవసాయ కుటుంబానికి చెందిన బన్నీ ఈ ఘనత సాధించడం పట్ల అతని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టరేట్ సమావేశం మందిరం లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం విద్యార్థిని అభినందించి, శాలువతో సన్మానించారు.

కలెక్టర్ మాట్లాడుతూ, బన్నీ సాధించిన విజయం కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. అతను భవిష్యత్తులో మరిన్ని శిఖరాలను అధిరోహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ

అతని విజయాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శ్రీనివాస స్వామి పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!