ఇసాయిపేటలో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 1 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం ఇస్సాయిపేట గ్రామంలో గ్రామస్తుల సహకారంతో గ్రామ దేవత మూర్తుల స్థిర ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేద పండితులు బ్రహ్మశ్రీ వడ్లూరి నరేంద్ర చార్యులు , కాళీమాత ఉపాసకులు గురువు ఆశీస్సులతో తుడిసి కుమ్మేనపల్లి సాయి కిరాణాచార్యులు, బ్రహ్మశ్రీ వడ్లూరి విశ్వనాధ్ శర్మ వారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు సంపూర్ణ సహకారం చేత గ్రామ దేవతామూర్తుల స్థిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గ్రామ దేవత మూర్తులైన నల్ల పోచమ్మ,, ముత్యాలమ్మ,, మత్తడి పోచమ్మ,, దుర్గమ్మ, లక్ష్మమ్మ, నాయికమ్మ దేవత మూర్తులను గ్రామ ప్రజల ఆర్థిక సహకారంతో ఆలయాలు నిర్మించి విగ్రహ ప్రతిష్టన చేశారు. బుధవారం పోచమ్మలకు బోనాలు అంగరంగ వైభవంగా సమర్పించారు. మహా అన్న ప్రసాదం, నాయకమ్మ బోనాలు సమర్పణ, గురువారం తిరుగు బోనాలు నిర్వహించారు. గ్రామంలో భక్తిశ్రద్ధలతో ప్రజలు పాల్గొంటారని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జగడం లలితా నరసింహులు, ఉప సర్పంచ్ చింత రాకేష్ కుమార్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, ఈసాయిపేట గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


