బీబీపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 1 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్స్ డే ను ఘనంగా జరుపుకున్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వాసవి క్లబ్ భవనంలో బచ్చు బైరవి లత చంద్రశేఖర్ ల కూతురు హరిప్రియ, బచ్చు స్వప్న రాజుల కూతురు అనుష ఎంబిబిఎస్ లో ఉత్తీర్ణులై పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొరకు సిద్ధమయ్యాడంతో వీరిని వైద్యుల దినోత్సవం సందర్భంగా వాసవి క్లబ్ తరఫున కాలువ బహుమతులతో ఘనంగా సన్మానించారు. ప్రజలను రక్షించే వైద్యవృత్తిని ఎన్నుకొని వైద్య రంగంలో రాణించడంపై అభినందించారు. వైద్యరంగంలో రాణించి ప్రాణాలను కాపాడే వృత్తిని ఎన్నుకొని ఇతరులకు వైద్యం అందించి ప్రాణాల నిలబెట్టాలని కోరారు. ప్రతి ఒక్కరికి వైద్యులు మార్గదర్శకంగా, ప్రాణాలను కాపాడే వారిగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మురికి శ్రీనివాస్, రెడ్డిశెట్టి శ్రీనివాస్, వాసవి క్లబ్ వాయిస్ గవర్నర్ బాశేట్టి నాగేశ్వర్, బచ్చు రామచంద్రం, రెడ్డిశెట్టి వెంకటేశం, ఆర్యవైశ్య సంఘం కోశాధికారి తోడుబూసురు శ్రీనివాస్, బచ్చు వెంకటరమణ, సన్మాన గ్రహితులు బచ్చు రాజు, బచ్చు చంద్రశేఖర్ పాల్గొన్నారు.
You may also like
గ్రామీణ ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత…
పట్టణంలో అక్రమ, నిర్మాణ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డిలో శాశ్వత తాగునీటి సమస్యకు పరిష్కారం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
ఇసాయిపేటలో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
తెలంగాణలోనే ఆదర్శ నియోజకవర్గంగా కామారెడ్డిని తీర్చిదిద్దడమే నా లక్ష్యం…


