కామారెడ్డిలో శాశ్వత తాగునీటి సమస్యకు పరిష్కారం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…

కామారెడ్డిలో శాశ్వత తాగునీటి సమస్యకు పరిష్కారం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జులై 1 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో సీనియర్ సిటిజన్స్ ఫోరం సమీపంలో (అమృత్) పథకం కింద నిర్మించనున్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పనులకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

కామారెడ్డి పట్టణ ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద రూ.93 కోట్లతో సమగ్ర తాగునీటి ప్రాజెక్టును చేపట్టిందన్నారు.

ఈ ప్రాజెక్టు కింద పట్టణంలో మొత్తం 9 ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించగా, ఇప్పటికే 8 ట్యాంకుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.

విద్యానగర్ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి స్థల సమీకరణలో కొంతకాలంగా ఇబ్బందులు ఎదురయ్యాయని, చివరకు రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ కేటాయించిన స్థలంలో ట్యాంక్ నిర్మాణానికి అవకాశం లభించడంతో నేడు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు.

ఈ స్థలాన్ని ప్రజా ప్రయోజనం కోసం అందించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ తొమ్మిదో వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయితే కామారెడ్డి పట్టణంలో తాగునీటి సరఫరా మరింత సమర్థవంతంగా జరిగి, నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని షబ్బీర్ పేర్కొన్నారు.

అలాగే పట్టణంలో దాదాపు 100 కిలోమీటర్ల మేర చేపట్టిన కొత్త తాగునీటి పైప్‌లైన్ పనులు కూడా పూర్తికావచ్చాయని, త్వరలోనే ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీటిని అందించే లక్ష్యాన్ని ప్రభుత్వం సాధిస్తుందని చెప్పారు.

ముఖ్యమంత్రి నాయకత్వంలో కామారెడ్డి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని విధాలా కృషి కొనసాగుతుందని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఐరేని సందీప్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు భూమని బాలరాజ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు, రెడ్డి నాయక్, రాజా గౌడ్, నౌసిలాల్ నాయక్, నరేందర్ రెడ్డి, అంకం కృష్ణారావు, పండ్ల రాజు, కారంగుల అశోక్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, భీమ్ రెడ్డి, సుతారి రమేష్, తిరుమల గౌడ్, ఐరేని నర్సయ్య, సత్యం, అన్వర్ అహ్మద్, అంజద్, లడ్డు, వాజిద్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, సిద్ధిక్, జావిద్, మాజీద్, మసూద్, యూనిస్, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, ఇంజినీరింగ్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు, కాలనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!