పట్టణంలో అక్రమ, నిర్మాణ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి…

పట్టణంలో అక్రమ, నిర్మాణ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి…

కామారెడ్డి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కు వినతి పత్రం సమర్పించిన బీజేపీ కౌన్సిలర్ లు..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 1(అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి పట్టణంలో అక్రమంగా నిర్మించిన, నిర్మాణం చేపడుతున్న కట్టడాలపై మున్సిపల్ కమిషనర్ కు బిజెపి కౌన్సిలర్లు వినతి పత్రం అందించారు.

బుధవారం ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్ లు మాట్లాడుతూ. కామారెడ్డి పట్టణంలో గతంలో, ప్రస్తుతం యదేచ్చగా నిబంధనలకు విరుద్ధంగా డివియేషన్ లేకుండా, సెల్లార్ అనుమతి లేకుండా పార్కింగ్ సదుపాయం లేకుండా, నాలా పై భవనాలు నిర్మిస్తున్నారని అన్నారు. వీటి విషయంలో కొంత మంది చేతి వాటం చూపి కట్టడాల నిర్మాణానికి సహకరిస్తున్నారని ఈ విషయంలో సరియైన విచారణ చేపట్టి అక్రమ కట్టడాల విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కీ వివరించినట్టు తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరిగినా, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోక పోయినా బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని అన్నారు. అలాగే చేతివాటం చూపే అధికారులు, రాజకీయ నాయకుల మాటలు నమ్మి నిర్మాణాలు చేపడితే తర్వాత జరిగే పరిణామాలకు యజమానులు బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి బిజెపి మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!