గ్రామీణ ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత… 
– ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 1 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి నియోజకవర్గం పల్వంచ మండలం ఈ ఇసాయిపేట గ్రామంలో గ్రామదేవతలు పోచమ్మ తల్లి తోపాటు ఐదుగుళ్ళు విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం మరియు బోనాల పండుగ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరై, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ పోచమ్మ తల్లికి మరియు గ్రామదేవతలకు పట్టు వస్త్రాలు సమర్పించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.
అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేసారు
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ,
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ప్రజల ఐక్యతకు, భక్తి భావానికి నిదర్శనమని అన్నారు.
గ్రామదేవతల పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం, ఆధ్యాత్మిక చైతన్యం సమాజంలో సత్సంబంధాలు, సామరస్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలో దేవాలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామాల అభివృద్ధితో పాటు ఆలయాల అభివృద్ధికీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ ధార్మిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తన సహకారం కొనసాగుతుందని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.
ఇసాయిపేట గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌కు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు, మహిళలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.
You may also like
పట్టణంలో అక్రమ, నిర్మాణ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డిలో శాశ్వత తాగునీటి సమస్యకు పరిష్కారం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
బీబీపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే…
ఇసాయిపేటలో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
తెలంగాణలోనే ఆదర్శ నియోజకవర్గంగా కామారెడ్డిని తీర్చిదిద్దడమే నా లక్ష్యం…


