భిక్కనూర్ గిద్ద హరిజనవాడలో ఘనంగా ప్రతిష్ట ఉత్సవాలు…

భిక్కనూర్ గిద్ద హరిజనవాడలో ఘనంగా ప్రతిష్ట ఉత్సవాలు…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అయితే జూలై 3 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలోని గిద్ద హరిజనవాడలో మాదిగ సదర్ సంఘం ఆధ్వర్యంలో మహాదేవి (మాతమ్మ) విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు , పేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మాదిగ సదర్ సంఘం వారు ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్టన చేశారు. అంబారిపేట శంకర్. మహా అన్న ప్రసాదం ఆయన సొంత ఖర్చులతో అన్నదానం నిర్వహించారు. గ్రామంలో భక్తిశ్రద్ధలతో ప్రజలు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గత మూడు రోజులుగా, హోమం , పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రతిష్టాపన ఉత్సవాలు భక్తులకు కొత్త కళ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో మాదిగ సదర్ సంఘం అధ్యక్షులు నర్సింలు, సిద్ధ రాములు, సురేష్ బాలయ్య, సదర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!