మాదిగ ఉద్యోగుల సమైక్య కర్నూలు జిల్లా నూతన అధ్యక్షునిగా మజిల్ మాదిగ ఎన్నిక .. 

 

ఎడిటర్ కర్నూలు జిల్లా వెల్దుర్తి మే 21 (అఖండ భూమి) : మాదిగ ఉద్యోగుల సమైక్య కర్నూలు జిల్లా నూతన అధ్యక్షునిగా మజిల్ మాదిగ ఎన్నిక జరిగినట్లు ఎం ఈ ఎఫ్ జిల్లా నూతన అధ్యక్షులు మజిల్ మాదిగ తెలిపారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా డోన్ లో జరిగిన బహిరంగ సభ అనంతరం మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ వెల్దుర్తి మండలం చెర్ల కొత్తూరు గ్రామంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న మజిల్ మాదిగ అలియాస్ మద్దిలేటి స్వామిని కర్నూలు జిల్లా మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఎంఈఎఫ్ నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవం ఎన్నుకోవడం  జరిగింది. అధ్యక్షుడిగా నన్ను నియమించిన మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ కు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను అని తెలిపారు. మాదిగ ఉపకులాల ఉద్యోగులకు సంఘటితం చేస్తూ వర్గీకరణ లక్ష్యసాధనలో నా వంతు పాత్రను పోషిస్తూ ముందుకు నడుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు భిక్షాలు మాదిగ, ఎం ఎస్ పి జాతీయ నాయకులు గుండాల ఈశ్వరయ్య మాదిగ ఎంఎస్పీ జిల్లా నాయకులు కేశవయ్య మాదిగ బజారన్న మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా కోకన్వీనర్ రెడ్డి పోగు భాస్కర్ ఎంఎస్పి మండల సీనియర్ నాయకులు మోష గిడ్డయ్య ఎంఈఎఫ్ మండల నాయకులు రెడ్డి పోగు ప్రకాష్ సోమయ్య సురేష్ సురేంద్ర బజారు పెద్దరాయుడు దేవదానం తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!