అమరావతి అఖండ భూమి వెబ్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ లో భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించింది. గుంటూరులో ఐదు అంతస్తుల భవనంలో పార్టీ ఆఫీసును బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ ఆదివారం ప్రారంభించారు..
అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు తరలి వచ్చారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాల్లో వేగం పెంచారు. ఈ క్రమంలోనే గుంటూరులో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఐదు అంతస్తుల ఈ భవనంలో మొదటి అంతస్తులో కార్యకర్తలతో సమావేశ మందిరం, రెండు మూడు అంతస్తులలో పరిపాలన విభాగాలకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీకి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది..
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


