కామారెడ్డి జిల్లాలో జాబ్ మేళా విజయవంతం…
– పైడి ఎల్లారెడ్డి సహకారంతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 19. (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడుకామారెడ్డి లోనీ సాందీపని డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైందని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ సెక్రెటరీ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయన మాట్లాడుతూ సుమారు 23 కంపెనీలతో నిర్వహించిన జాబ్ మేళాలో పదవ తరగతి ఇంటర్,డిగ్రీ, పీజీ,బీటెక్,ఎంటెక్, ఐటిఐ, డిప్లమా, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ పూర్తి చేసిన 270 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగం పొందుకున్న నిరుద్యోగులను పైడి ఎల్లారెడ్డి అభినందించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల హెచ్ ఆర్ లతో పాటు కళాశాల డైరెక్టర్ బాలాజీ రావు,ప్రిన్సిపాల్ సాయిబాబా,మనోజ్, హేమారెడ్డి,రాజు దాస్,రాజశేఖర్,రామకృష్ణ, సురేష్,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


