సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి…
వై ఆర్ జి కేర్ లింక్ వర్కర్ స్కీం ఉమ్మడి జిల్లా డి ఆర్పి గర్దాస్ సుధాకర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 30 (అఖండ భూమి న్యూ
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వై.ఆర్.జి కేర్ లింకు వర్కర్ స్కీం ఉమ్మడి జిల్లా డీ. ఆర్.పి. గర్దాసు సుధాకర్ తెలిపారు. గురువారం బిబిపేట మండల కేంద్రంలోని గ్రామ సంఘం కార్యాలయంలో సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వర్షాలు కురుస్తున్నందున వివిధ రకాల సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి దోమతెరలను వాడాలని తెలిపారు. చర్మవ్యాధులు, సుఖ వ్యాధులను నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. ఆయా వ్యాధులపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో క్లస్టర్ లింకు వర్కర్ బాలకిషన్, గ్రామ సంఘాల ప్రతినిధులు, వివో ఏలు పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


