నల్ల నీరు అందించడమే లక్ష్యంగా జలసిరి కార్యక్రమం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 30 (అఖండ భూమి న్యూస్);
జలసిరి కార్యక్రమంలో భాగంగా అన్ని విధాలుగా నీటిని కాపాడుకొని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి జలసిరి కార్యక్రమం ను గ్రామాల్లో విజయవంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామ సర్పంచ్ లోయపల్లి శ్రీనివాసరావు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఈ సందర్భంగా మాట్లాడారు. జలసిరి కార్యక్రమం అందరికీ అందుబాటులో ఉండే విధంగా నీటిని వినియోగంలోకి తీసుకు రావడం, అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కలిసి రావాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలసిరి కార్యక్రమం పై అవగాహన కల్పించారు. అందరి కృషితోనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. అనంతరం నీటి వనరులపై ప్రజలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లోయపల్లి లతా శ్రీనివాసరావు, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సంజీవరెడ్డి, కారోబార్ శ్యామ్ కుమార్, గ్రామ పాలన అధికారి, అంగన్వాడీ టీచర్లు, వీడు అసిస్టెంట్ బట్టసత్యం, ఐకెపి సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


