తూనికలు, కొలతల పరికరాలు సరిచూచుట.

 

తూనికలు,కొలతల పరికరములు ఉపయోగించు ప్రతి వ్యక్తి / సంస్థ విధిగా వారి వారి పరికరములను నిర్ణీత సమయములో తూనికలు, కొలతల శాఖ వద్ద సమర్పించి సదరు పరికరములు నిర్ణీత ప్రమాణములకు అనుగుణంగా సరిచేయించుకొని ముద్రలు వేయించు కొనవలెను.తూనికలు, కొలతల పరికరములపై సరియిన ముద్రలు లేకుండా వినియోగించడం  కలిగి ఉండడము చట్టారీత్యా నేరము.

తనిఖీలు:

ఈ క్రింద పేర్కొనిన అంశాలకు సంబంధించి తూనికలులు కోలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించేదరు.

తూనికలు,కొలతలు ప్రామాణీకమా?కాదా?

సకాలములో సరిచూచ బడినవా? లేదా?

సదరు పరికరముల ద్వారా ఖచ్చితమైన పరిమాణాలను ఇచ్చుచున్నారా?లేదా?

ప్యాకేజీ వస్తువులు.

ప్రామాణిక లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్, 2011 ప్రకారంగా ముందుగా ప్యాక్ చేయబడిన సరుకులు ఈ క్రింద తెలిపిన వివరములు ముద్రించునప్పుడు సదరు తయారీదారులు/అమ్మకం దారులపై తూనికలు కోలతల శాఖ వారిచే తగు చర్యలు చేపట్టబడును.

మీరు కొన్న లేక మీకు చేర్చిన సరుకు పేర్కొన్న దాని కంటే తక్కువ బరువు ఉన్నప్పుడు

ప్యాకేజీ పైన సరుకు పేరు , దాని పరిమాణం, తయారు తేదీ,చిల్లర అమ్మకపు ధర వంటి ముఖ్యమైన సమాచారం పొందుపరచనప్పుడు.

ప్యాకేజీ పైకి నమ్మించేలా కనపడి,దానిపైన పేర్కొన్న దాని కన్నా తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు

విలువైన నగలు, రత్నాలను ఉత్తమ ప్రామాణిక తూనికలను కాకుండా విక్రయించి నప్పుడు,ప్యాకేజీపై ముద్రించిన ధరను వ్యాపారస్తునికి అనుకూలంగా చెరపడం, మరకవేయడం లేదా మార్చడం చేసినప్పుడు

ప్రామాణిక బరువు లేదా కొలతను వాడకుండా సరుకును అమ్మినప్పుడు.

ఇనుము టి.ఎం.టి.బార్ల వంటి ఘనా పదార్తలను బరువుపైన కాకుండా సంఖ్యాపరంగా అమ్మిన ప్పుడు.

దిగుమతి అయిన సరుకుల ప్యాకేజీపై దిగుమతిదారుని పేరు, సరుకుల పరిమాణము మరియు చిల్లర అమ్మకపు ధర తయారైన నెల, సంవత్సరం వంటి వివరాలు లేనప్పుడు.

ప్యాకేజీలపై గరిష్ట చిల్లర ధరను మార్చగలిగే విధంగా వేర్వేరు స్టిక్కర్లు అతికించి ఉన్నప్పుడు

పెట్రోలు,డీజిల్ సరఫ్రా చేసే పెట్రోలు పంపు కొలత ప్రమాణం సరిచూసు కొనడానికి వీలుగా ఐదు లీటర్ల పరీక్షా కొలసాధనం సమకూర్చ లేనప్పుడు.

ఒక వస్తువు ప్రకటితమైన గరిష్ట రిటైలు ధర కన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నప్పుడు

ఫిర్యాదుల నిమిత్తం వినియోగదారులు సంప్రదించుట కొరకు ప్యాకేజీపై వినియోగ దారుల సంరక్షణ వివరములు ఫోను నంబరుతో సహా ముద్రించనప్పుడు.పైన తెలిపిన విధులతో బాటు,అందు బాటులో ఉన్న ఫిర్యాదుల పరిష్కార యంత్రాగాన్ని ఉపయోగించు కొనేలా వినియోగదారులకు సాధికారికతను సమకూర్చడం.

అలా కాకుండా అధిక ధరలకు అమ్మితే బాధిత వినియోగదారుడు తూనికల,కొలతల శాఖవారి టోల్‌ఫ్రీ నెంబర్‌ 1800-425-4202 కి ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసి న్యాయాన్ని పొందొచ్చు. మరియు ప్రతి వినియోగదారులకు ఎదురయ్యే ప్రతి సమస్య లను,,1902, ఫోన్ చేసి తెలియపరచవచ్చు ఫిర్యాదులు చేయవచ్చు స్పందన అర్జీకి రషీద్ కూడా వస్తుంది

వినియోగదారుల హక్కుల పరిరక్షణ న్యాయ సభ,ఆంధ్రప్రదేశ్, సభ్యత్వం కొరకు ఈ నెంబర్ కు సంప్రదించగలరు:9866654313, 8008566613,913336644

9441793678,హెల్ప్ లైన్ నెంబర్,MCIC, ఇంచార్జ్ బొబ్బిలి, విజయనగరం జిల్లా, హానరబుల్ ప్రెసిడెంట్, CRPFI 7995398339,  CRPFI,

జై హింద్ …🇮🇳భారత్ మాతాకీ జై…🇮🇳

Akhand Bhoomi News

error: Content is protected !!