దగ్గు మందు ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

 

 

దిల్లీ: భారత్‌ (India)లోని కొన్ని కంపెనీలు తయారుచేసిన దగ్గు మందుల (Cough syrup) కారణంగా కొన్ని దేశాల్లో మరణాలు సంభవించడం ఇటీవల తీవ్ర ఆందోళనలకు దారితీసింది.

ఆ సిరప్‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఇటీవల హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలోనే దగ్గు మందు ఎగుమతులపై కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దగ్గు సిరప్‌లకు ప్రభుత్వ ల్యాబ్‌ (Govt Labs)లలో అనుమతి తప్పనిసరి చేసింది. ఆ తర్వాతే ఎగుమతులు (Exports) చేసుకోవాలని స్పష్టం చేసింది. జూన్‌ 1 నుంచి ఈ నూతన నిబంధనలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది..

దగ్గు మందు (Cough syrup) ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ఏదైనా ప్రభుత్వ లాబొరేటరీలో పరీక్షించి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్‌ సమర్పిస్తేనే తమ దగ్గు మందులను ఎగుమతి చేసేందుకు అనుమతులు లభిస్తాయి. జూన్‌ 1వ తేదీ నుంచి ఈ నిబంధన తప్పనిసరి” అని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (DGFT) ఓ అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్‌ ఫార్మాకోపియా కమిషన్‌, రీజినల్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ (RDTL – Chandigarh), సెంట్రల్‌ డ్రగ్స్‌ ల్యాబ్‌ (CDL – Kolkata), సెంట్రల్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ (CDTL – Chennai Hyderabad, Mumbai), ఆర్‌డీటీఎల్‌ (గువాహటి)తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని గుర్తింపు పొందిన ల్యాబ్‌ల్లో దగ్గు మందుకు తనిఖీలు చేయించుకోవాలని కేంద్రం ఎగుమతుదారులకు స్పష్టం చేసింది..

Akhand Bhoomi News

error: Content is protected !!