పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

 

 

పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నల్గొండ అఖండ భూమి వెబ్ న్యూస్ :

సీఎం..సీఎం అని అనొద్దు.. మంత్రి పదవినే వదిలివేశాను.. నాకు ఏ పదవీ ముఖ్యం కాదు. నాకు ప్రజలే ముఖ్యం..మీకోసం చావడానికైనా..చంపడానికైనా సిద్ధమే. ఐదు సార్లు గెలిపించిన మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.” అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (MP Komatireddy Venkat reddy) వ్యాఖ్యానించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు వద్ద కృష్ణా జలాలకు పూజలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 60వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు..

సీఎం అనకుంటేనే సీఎం అవుతానని, మీరు సీఎం.. సీఎం అంటే అంతా కలిసి ఎమ్మెల్యేగనే ఓడిస్తారని అన్నారు. వచ్చే వారం పది రోజుల్లో నల్గొండలో ప్రియాంక గాంధీ బహిరంగ సభ ఉంటుందన్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!