విలక్షణనటుడు శరత్ బాబు మృతికి సంతాపం.

 

 

విలక్షణనటుడు శరత్ బాబు మృతికి సంతాపం.

– యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి గోదావరి ఖని మే 22 అఖండ భూమి వెబ్ న్యూస్ :

వెండితెర సీనియర్ నటుడు

శరత్ బాబు మృతి పట్ల యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి తీవ్ర అవేదన వ్యక్తం చేశారు. 1980 – 1990 దశకంలో ఉత్తమ సహాయ నటుడుగా నంది పురష్కారాన్ని శరత్ బాబు అందుకున్నారు అని తెలిపారు.శరత్ బాబు విలక్షణమైన తెలుగు సినిమా నటుడు అని తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో కథానాయకుడుగానే కాక, ప్రతినాయకుని పాత్రలు, తండ్రి, స్నేహితుని వంటి విలక్షణ పాత్రలు పోషించాడు అని కొనియాడారు. శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్ అని సినీరంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్‌బాబుగా మార్చారు అని తెలిపారు.

హీరోగా శరత్ బాబు తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం అని తర్వాత కన్నెవయసు చిత్రంలో నటించారు అని అటుపిమ్మట సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు అని అన్నారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు అని తెలిపారు.

శరత్ బాబు 1951 జూలై 31 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని ఆమదాలవలస లో జన్మించారు అని శరత్ బాబు సినిమాలలో నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అప్పటికే తెలుగు సినీ రంగంలో సుస్థిరమైన నటి అయిన రమాప్రభను ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు అని తెలిపారు. రమాప్రభ, శరత్ బాబు కంటే నాలుగేళ్ళు పెద్ద అయితె వ్యక్తి గత కారణాలతో వీరు విడిపోయారు అని అన్నారు. ఈ సందర్బంగా యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి శరత్ బాబు అత్మకు శాంతి చేకూరాలని కోరుతు ప్రగాడ సానుభూతి తెలిపారు

Akhand Bhoomi News

error: Content is protected !!