యస్ రాయవరం
ఇసుక అక్రమరవాణాదారులపై ఉక్కుపాదం మోపుతామని మండల తహశీల్ధారు శ్యామ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం దార్లపూడి వరహానది నుండి ఇసుక తరలిస్తున్న తొమ్మిది ఇసుక బళ్ళను, ధర్మవరం వద్ద ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.పట్టుకున్న బళ్ళు ట్రాక్టర్లను స్థానిక పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మండలంలోఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక మట్టి తరలిస్తే కఠినచర్యలు తప్పవన్నారు.

ANDHRA NEWS PAPER STATE

