ఎస్ రాయవరం మండలం లోని కొరుప్రోలు గ్రామదేవత శ్రీ నూకాలమ్మతల్లి అమ్మవారు మరియు శ్రీ సీతారామస్వామి వారి ఆలయాలకు చెందిన పల్లం మరియు మెట్టు భూముల కౌలుకు వేలంపాట నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు మంగళవారం ఉదయం కొరుప్రోలు వచ్చిన వారు రెండు ఆలయాల ట్రస్టీలకు ఈ మేరకువేలం నిర్వహణ పత్రాలను అందించారు శ్రీ నూకాలమ్మతల్లి ఆలయంనకు చెందిన సర్వే నెంబరు 177లో 12.22 ఎకరాలు,101/4 లో 4.86 సెంట్లు, 598లో 4.74 సెంట్లు మెరక భూములకు, శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన సర్వే నెంబరు 304/2 లో 2.14 సెంట్లుపల్లం భూమి,39/4 లో 1.27 సెంట్లులోని మెరక భూములకు 26 వతేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రీ నూకాలమ్మతల్లి ఆలయం ఆవరణలోను,మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీ సీతారామస్వామి ఆలయం వద్ద వేలంపాట నిర్వహిస్తామన్నారు వేలంపాటలో పాల్గొనే పాటదారులు ఒక్కొక్క సర్వే నెంబరు 5000 ధరావత్తు చెల్లించాల్సి వుంటుందని తెలిపారు. దేవస్థానంనకు బకాయిలు ఇతర లావాదేవీలు ఉన్నవారు అనర్హులన్నారు. పాటలో పాల్గొనే వారు లక్ష రూపాయలు సాల్వెన్సీ సర్టిఫికెట్ తో పాటు ఆధార్ కార్డు నకలు కాఫీ సమర్పించాలన్నారు పాట పాడుకున్న పాటదారుడు ఒక సంవత్సరం శిస్తు ముందుగ ఆయా దేవస్థానాలకు చెల్లించడంతో పాటు మూడు ఖాళీ చెక్కులను దేవాదాయశాఖకు ఇవ్వాలని సూచించారు. సదరు భూములకు సంబంధించి హెచ్చుతగ్గులున్నా వాటిపై ఎటువంటి తగాదాలు లేకుండా పాటదారుడు ఆమోదించాలని తెలిపారు. ఇంకా సమాచారం కొరకు 9110357800 ను సంప్రదించాలని సూచించారు.


