కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కథా రచయిత, సాహితీవేత్తగా ప్రసిద్ధిగాంచిన కేతు విశ్వనాథరెడ్డి మరణం బాధాకరమని సి ఐ టి యు జిల్లా అధ్యక్షుడు కామనురు.శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాడు కమలాపురంలో పట్టణం లోని జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1939 జులై 10 కమలాపురం నియోజకవర్గం రంగసాయిపురంలో జన్మించిన కేతు విశ్వనాధ్ రెడ్డి కడపజిల్లా గ్రామ నామాలు అనే అంశంపై పరిశోధనకు గాను డాక్టరేట్ పొందారని ఆయన తెలిపారు. పాత్రికేయుడు గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి కడప, తిరుపతి, హైదరాబాదు లాంటి చోట్ల అధ్యాపకుడుగా పనిచేసి డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టరు గా పదవీవిరమణ చేశారన్నారు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఎస్ ఈ ఏర్ టి సంపాదకుడుగా వ్యవహరించారని. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి దాకా అనేక పాఠ్య పుస్తకాలకు సంపాదకత్వం వహించి పాఠ్య ప్రణాళికలను రూపొందించారని ఆయన ఆన్నారు.
ఆయన జీవిత కాలంలో అనేక పురస్కారాలు అందుకున్నారని తెలిపారు. అభ్యుదయ రచయితల సంఘం బాధ్యతలు స్వీకరించి గట్టిగా కృషి చేసిన వ్యక్తి కేతు విశ్వనాథరెడ్డి అని ఆయన అన్నారు. ఆయన మరణం పట్ల సంతాపం తెలియజేస్తూ, వారికుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.



