తాతకు తగ్గ మనమరాలు

తాతకు తగ్గ మనమరాలు

 

 

-తాతయ్య అసెంబ్లీలో, మనుమరాలు నృత్యంలో..

-దుబాయిలో ఆకట్టుకున్న జయ రెడ్డి నృత్య ప్రదర్శన..

-తెలంగాణ సాంస్కృతిక బతుకమ్మ సంబరాల్లో చక్కటి ప్రతిభ ప్రదర్శన..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ సెప్టెంబర్ 28: (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మనవరాలు, ఆర్ ఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్, సుచరిత రెడ్డి దంపతుల కుమార్తె జయ రెడ్డి(8) దుబాయిలో ఇండియన్ పీపుల్స్ ఫోరమ్స్ (ఐపీఎఫ్) ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ సంబరాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనతో చూపరులకు ఎంతో ఆకట్టుకుంది. చిన్నారి జయ రెడ్డిని నిర్వాహకులు జయ రెడ్డికి నృత్యంలో ఎంతో భవిష్యత్తు ఉందని అభినందించి మెమెంటోను అందజేశారు. దుబాయ్ లో ఇలాంటి వేదికపై అందరినీ ఆకట్టుకునే ప్రదర్శన చేసి అందరి మన్ననలను పొందడం ఎంతో గర్విస్తున్నానని, ఇదంతా గురువు అయినా డాక్టర్ నవ్యానందిని శిక్షణ ప్రోత్సాహంతో సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేస్తూ తల్లి సుచరిత రెడ్డి తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!