మహిళ కనిపించుటలేదు
-సంవత్సరం పాపతో పాటు..
-మచ్చర్ల, స్వప్న (36)
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ సెప్టెంబర్ 28: (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్, నియోజకవర్గం ఆలూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన స్వప్న (36) అనే మహిళ భర్త రాములతో గొడవపడి శనివారం ఉదయం 10 గంటల సమయంలో సంవత్సరం గల పాపతో ఇంటి నుండి వెళ్లిపోయింది. భర్త రాములు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని, ఎవరికైనా పై ఫోటోలో చూపబడిన మహిళ, చిన్న పాప కనబడితే 8712659858, 8712578207, 8712659752 ఫోన్ నెంబర్లకు చేసి తెలపాలని సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.



