విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం లో వేపాడ మండలం లో వైస్సార్సీపీ నాయుకులు చంద్రబాబు నాయుడు గారు మాటల వైఖరి పై నిరసన వ్యక్తం చేశారు
. ఈ కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్ వ్యాచలపు చిన వెంకట రాము నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు మాటల వైఖరి బాగోలేదు అని ఇంత బాగా అభివృద్ధి చెందుతున్న గ్రామాలని చూసి ఓర్వలేక ఈ లాంటి మాటలు ఆడుతున్నారని ఆయన అన్నారు. వైజాగ్ లాంటి సిటీ లో సేంట్ స్థలం ఇవ్వడం ఎంతో గొప్ప తనం అని ఆయన అన్నారు. ఈ లాంటి గొప్ప విషియాన్ని స్మసేనవటిక తో పోల్చడం మా దౌర్భాగ్యస్థితి అని ఆయన అన్నారు. చంద్రబాబు వెంటనే సీఎం గారికి క్షమాపణ చెప్పాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలిసి ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమనికి ఎంపీపీ దొగ్గ సత్యంవంతుడు, జడ్పీటీసీ S. అప్పారావు, పంచాయతీ రాజ్ వింగ్ జోనల్ ఇంచార్జ్ మెరుపులు సత్యనారాయణ, చాలుమూరి పద్మావతి, వేపాడ మండల పార్టీ అధ్యక్షులు జగ్గుబాబు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కార్యకర్తలుహాజరయ్యారు.


