యస్ రాయవరం.
పాము కాటుకు గురై వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని గెడ్డపాలెం గ్రామంలో జరిగింది మంగళవారం ఉదయం స్థానిక పోలీసులకు మృతుడు భార్య పినపాతృని మంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గెడ్డపాలెం గ్రామానికి చెందిన పినపాతృని బాబ్జీ ఈ నెల ఐదవ తేదీన కూలిపనికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో గుర్తు తెలియని పాము కాటుకు గురయినట్లు ఫిర్యాదు లో పేర్కొన్నారు ఇంటికి వచ్చి తనకు విషయం తెలుపగా తన కుటుంబ సభ్యులతో కలసి నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం తుని ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుండి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు చికిత్స పొందుతూ నేటి ఉదయం ఎనిమిది గంటల సమయంలో మరణించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు యస్ రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు


