దాడుల్లో పట్టుబడిన అక్రమ మద్యం ధ్వంసం.
ఆలమూరు (అఖండ భూమి) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ వారి ఉత్తర్వులు మేరకు అమలాపురం ఎస్ఇబి అసిస్టెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వి.శివరామకృష్ణ సమక్షంలో ఆలమూరు మండలం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్ళను బుధవారం ద్వంసం చేసినట్లు ఎస్సై ఎస్.శివప్రసాద్ తెలిపారు.ఈ మేరకు వారు తెలిపిన వివరాలు ప్రకారం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ మద్యం),డ్యూటీ పెయిడ్ లిక్కర్ కి సంబంధించి 60,430 రూపాయలు విలువగల 1860 బాటిల్స్ లో ఉన్న సుమారు 355 లీటర్ల మద్యాన్ని పోలీస్ స్టేషన్ ఆవరణ నందు అధికారులు సమక్షంలో జెసిబితో తొక్కించి ధ్వంసం చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యాన్ని తరలించి,విక్రయాలు జరిపితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఇబి పోలీస్ లు,పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



