మహానాడును విజయవంతం చేయాలి

మండల టీడీపీ నేతలు కొట్యాడ, పోతల
అఖండ భూమి (వేపాడ )మే 23:- రాజమహేంద్రవరంలో ఈనెల 27,28తేదీలలో జరగనున్న మహానాడు సభలకు టీడీపీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని మండల టీడీపీ నేతలు కొట్యాడ రమణమూర్తి, పోతల వెంకటరమణ తదితరులు పిలుపునిచ్చారు. మండల కేంద్రం వేపాడలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి కోళ్ల లలితకుమారి, తెలుగుదేశం పార్టీరాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల రాంప్రసాద్ ల సారథ్యంలో మండల పార్టీ అధ్యక్షులు, టీడీపీ శ్రేణులంతాఅధిక సంఖ్యలో తరలివచ్చి మహానాడు సభలను విజయవంతం చేయాలన్నారు. ఇటీవల ఎస్ కోట పర్యటనకు విచ్చేసిన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేసిన సూచనల మేరకు నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులంతా నియోజకవర్గ పార్టీ ఇంచార్జి కోళ్ల లలితకుమారి నాయకత్వంలో ముందడుగు వేయాలన్నారు. పార్టీ పదవులు పొందిన నాయకులు గ్రూపులను ప్రోత్సహించడం వల్ల పార్టీ బలహీన పడే అవకాశం ఉన్నందున చంద్రబాబు సూచనల మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. గ్రూపులను ఎవరు ప్రోత్సహిస్తున్నారో వారు మాత్రం ఆత్మవిమర్శ చేసుకోవాలని, పార్టీ ఇంచార్జిపై తప్పుడు ఆరోపణలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించడం అన్న చందంగా ఉందన్నారు.ఈ సమావేశంలో టీడీపీ నాయకులు గోకేడ అచ్చం నాయుడు (మద్దాలు )నిరుజోగి బంగారునాయుడు, ఏడువాక రామకృష్ణ, కోన సత్యం, నిరుజోగి అమ్మతల్లి నాయుడు, గోకేడ సత్యం,గోకేడ నాగభూషణం, నాగిరెడ్డి ముత్యాలనాయుడు, గొర్రుపోటు ప్రసాద్, బూసరి కృష్ణకుమార్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


