ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేస్తున్న సి ఎస్ ఏ సంస్థ…

 

 

అఖండ భూమి (వేపాడ )మే23:-వేపాడ మండలం లో బొద్దాం గ్రామం లో ఈ సంస్థ ఉంది. ఇది సుమారు గా 13 సంవత్సరాలుగా ఈ సంస్థ పని చేస్తుంది ఈ సంస్థ తరపు నుంచి అనేక ఆరోగ్యకరమైన అనగా ప్రతి పంటను సేంద్రీయ పద్ధతుల్లో పండించే విధంగా ప్రతి రైతుకు వివరిస్తుంది. ఈ సంస్థలో కషాయాలు తయారు చేయడం, నవధాన్యాలు పంచడం కిచెన్ గార్డియన్లు వేయించడం అనేక రకమైన పనులు చేస్తుంది. ప్రతి రైతుకు పెట్టుబడి లేకుండా ఏ పంటను ఏ పద్ధతిలో పండించాలో ఈ సంస్థ అనేది 13 సంవత్సరాలుగా రైతుకు అలవాటు చేస్తుంది. ఈ కార్యక్రమంలోని భాగంగా కరకవలస, దబ్బరాజుపేట, చామలాపల్లి, గుడివాడలో నవధాన్యాలు కిట్టులు పంచడం జరిగింది. ఈ నవధాన్యాలనేవి భూమి సారవంతం చేయడానికి, కలుపు నివారించడానికి బాగా తోడ్పడుతుందని ఆ సంస్థ యొక్క రీజనల్ కోఆర్డినేటర్ పి వెంకట్రావు గారు అన్నారు. ఈ కార్యక్రమంలో . పెంటయ్య, వెంకటరావు,  లు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!