తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత.. మహిళలు, వృద్ధులను పోలీసులు లాగి పడేశారు!

 

 

Amaravati: తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత.. మహిళలు, వృద్ధులను పోలీసులు లాగి పడేశారు!

గుంటూరు: గుంటూరు జిల్లా తుళ్లూరులో అధికార, ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా తుళ్లూరు దీక్షా శిబిరంలో గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ నిరసన దీక్షకు పిలుపునిచ్చారు..

అయినప్పటికీ ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా తుళ్లూరులో తెదేపా ఆధ్వర్యంలో రైతులు నిరసన దీక్ష చేపట్టారు. అప్పటికే దీక్షా శిబిరం వద్ద పోలీసులు వందల సంఖ్యలో మోహరించారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ.. రైతులను పోలీసులు అరెస్టు చేశారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా పోలీసులు వారిని లాగి పడేశారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్‌నూ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతియుతంగా దీక్ష చేపడుతుంటే అడ్డంకులేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అరెస్టు చేసిన రైతులు, మహిళలను బలవంతంగా వాహనాలు ఎక్కించి తుళ్లూరు పీఎస్‌కు తరలించారు..

దీక్షా శిబిరంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. రోజువారీ నిరసనలకు కూడా అనుమతి లేదని పోలీసులు తేల్చి చెబుతున్నారు. ఎవరొచ్చినా సరే బలవంతంగా అరెస్టు చేస్తామని తేల్చి చెబుతున్నారు. మరోవైపు తుళ్లూరు మండలంలో తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు..

Akhand Bhoomi News

error: Content is protected !!