నకిలీ ఐపీఎస్ ఆఫీసర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

 

 

Hyderabad: నకిలీ ఐపీఎస్ ఆఫీసర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్: నకిలీ ఐపీఎస్ (Fake IPS) ఆఫీసర్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామ్ ఐపీఎస్ పేరుతో చలామణి అవుతూ.. పలు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్నాడు..

ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో పదవులు సెటిల్‌మెంట్ల పేర్లతో మోసాలు చేస్తున్నాడు. సైబరాబాద్‌లో ఏకంగా కార్యాలయమే తెరిచి.. బాధితులను కార్యాలయానికి పిలిపించి సెటిల్‌మెంట్స్ చేస్తున్నాడు. బాధితులకు ఇంటరాగేషన్ పేరుతో చుక్కలు చూపెడుతున్నాడు.

ప్రత్యేక పోలీస్ అధికారి పేరుతో నకిలీ ఐపీఎస్ రామ్ వ్యవహారం నడుపుతున్నాడు. హైదరాబాద్ చెందిన మహిళను ట్రాప్ చేసిన విషయం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. జాగ్వర్ కార్లను అతి తక్కువ ధరకు ఇప్పిస్తానని మోసానికి పాల్పడ్డాడు. పోలీస్ విచారణ పేరుతో చాలామందిని చిత్రహింసలకు గురిచేశాడు. తుపాకులు, పోలీస్ వాహనాల, సైరన్లను వేసి బెంబేలు సృష్టించాడు. సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు నకిలీ ఐపీఎస్ రామ్‌ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఎవరెవరి నుంచి ఎంత మొత్తం డబ్బులు వసూలు చేసింది.. తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!