మా బంధాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించం : ఆ ఘటనలపై మోదీ హెచ్చరిక

 

 

PM Modi : ‘మా బంధాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించం’: ఆ ఘటనలపై మోదీ హెచ్చరిక

దిల్లీ: ఆరు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న ప్రధాని మోదీ(PM Modi) తన పర్యటనను విజయవంతంగా కొనసాగిస్తున్నారు..

ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌(Australian PM Anthony Albanese), మోదీ బుధవారం పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ మధ్యకాలంలో ఆ దేశంలో హిందూ ఆలయాలు, ప్రార్థనా మందిరాలపై జరుగుతోన్న దాడులు వారి మధ్య చర్చకు వచ్చాయి..

‘ఆస్టేలియా(Australia)లో ప్రార్థనాస్థలాలపై జరుగుతోన్న దాడులు, వేర్పాటువాద శక్తుల కార్యకలాపాల గురించి అల్బనీస్‌, నేను గతంలో చర్చించాం. ఇప్పుడు కూడా ఆ అంశం మా మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు హానికలిగించే చర్యలను మేం ఏ మాత్రం అంగీకరించం. అలాంటి మూకలపై కఠిన చర్యలు తీసుకుంటామని అల్బనీస్‌ మరోసారి హామీ ఇచ్చారు’ అని మోదీ వెల్లడించారు. ఇక ఈ ఇద్దరు నేతలు పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, రక్షణ రంగాలకు చెందిన పలు అంశాలపై చర్చించారు..

Akhand Bhoomi News

error: Content is protected !!