లింగంపేట గ్రామ సచివాలయం మహిళా పోలీస్ అనారోగ్యంతో మృతి

లింగంపేట గ్రామ సచివాలయం మహిళా పోలీస్ అనారోగ్యంతో మృతిఅనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం లింగంపేట గ్రామ సచివాలయంలో మహిళ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న కొరుప్రోలు కృష్ణవేణి (28) అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు ఆమె స్వగ్రామం చోద్యం గ్రామం ఆమెకు 8 సంవత్సరాల క్రితం అమ్మపేట గ్రామానికి చెందిన గొర్లి నాయుడును వివాహం చేసుకున్నారు ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భవతి మంగళవారం విధులు నిర్వహించిన అనంతరం ఇంటికి వెళ్లాక ఆమెకు రక్తస్రావం కావడంతో వైద్య సేవల కోసం కుటుంబ సభ్యులు నర్సీపట్నం తీసుకువెళ్లారు పరిస్థితి  విషమించడంతో వైద్య సేవలు కోసం విశాఖపట్నం తరలిస్తుండగా రక్తస్రావం అధికంగా కావడంతో మార్గ మధ్యలోనే మృతి చెందారు ఆమె భర్త సెంటర్ జైల్ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!