ఆ వృద్ధురాలిని మానవత్వం కాపాడింది…

 

ఆ వృద్ధురాలిని మానవత్వం కాపాడింది…

వెల్దుర్తి మే 24 అఖండ భూమి వెబ్ న్యూస్ : ఆ వృద్ధురాలిని మానవత్వం కాపాడింది. కొన ఊపిరితో ఉన్న వృద్ధురాలికి చేయి చేయి కలిపి మానవత్వం చాటుకున్న వైనం వెల్దుర్తి మండలం లో చోటుచేసుకుంది స్థానికుల వివరాల మేరకు ముళ్లపొదల్లో అచేతనావస్థలో పడి ఉన్న వృద్ధురాలిని గుర్తించి తమ కెందుకులే అని

వెళ్లిపోకుండా ఆమెను ఆసుపత్రికి చేర్చి శభాష్ అనిపించుకున్నారు స్థానిక పోస్టల్ ఏజెంట్, గ్రామ

వలంటీర్, విలేకరి. వివరాల్లోకి వెళితే రామళ్లకోట రోడ్డులో ముళ్లపొదల్లో బుధవారం ఉదయం ఒక 80ఏళ్ల పైబడిన వృద్ధురాలు పడి ఉండడం గుర్తించాడు స్థానిక ఏజెంట్ వేమన. ఆ సమయంలోఅటుగా జాగింగ్కు వస్తున్న గ్రామ వలంటీర్ లక్ష్మీకాంతరెడ్డి సహకారంతో ఒక ప్రక్కకు చేర్చాడు.

విషయం తెలుసుకున్న స్థానిక విలేకరి చిన్న అక్కడకు చేరుకుని చీమలు పట్టిన ముదుసలి ఊపిరి భారంగా తీసుకుంటుడడం గమనించి అటుగా వస్తున్న ఆటోలో స్థానిక సీహెచ్సీకి తరలించాడు. డ్యూటీ డాక్టర్లు వృద్ధురాలికి చికిత్స అందించగా, ఒంటిపై బట్టలు సరిగా లేని వృద్ధురాలికి చీరను

విలేకరి ఏర్పాటు చేయగా వైద్య సిబ్బంది చీరను తొడిగించి వైద్యం అందించారు. తదుపరి మెరుగైన వైద్యానికి 108లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు

ఆసుపత్రి చేరుకున్న ఏఎస్ఐ శివరామిరెడ్డి వృద్ధురాలి ఆచూకీకి విచారణ ప్రారంభించారు. సాలమ్మ అని, రామలక్ష్మి అని తన భర్త నాగేంద్ర అని, తనది ఈదుల దేవర బండ అని చెబుతున్న వృద్ధురాలి

మతి స్థిమితం లేని మాటల మేరకు విచారణ ప్రారంభించాడుత్వం చూపి వృద్ధురాలిని

ఆసుపత్రి చేర్చి తామే వకాల్తా పుచ్చుకుని ఆద్యంతం సేవలందించిన యువకులను వైద్యులు, పోలీసులు, ప్రజలు అభినందించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!