మాజీ ఎంపీటీసీ కొర్ర కొండమ్మ భర్త కొర్ర రమణ పిడుగు పడి మరణించడం చాలా బాధాకరం, కొండమ్మ కుటుంబన్ని పరామర్శించిన:మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్
అల్లూరి జిల్లా: అనంతగిరి అఖండ భూమి వెబ్ న్యూస్ : అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ మాజీ ఎంపీటీసీ కొర్ర కొండమ్మ భర్త కొర్ర రమణ బుధవారం పిడుగు పడి స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇంచార్జి మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ గుమ్మకోట గ్రామానికి చేరుకుని కొండమ్మ కుటుంబ సభ్యులకు పరామర్శించి ఓదార్చారు. మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మాజీ ఎంపీటీసీ భర్త రమణ మరణించడం చాలా బాధాకరమని కుటుంబంలో ఒకరిని కోల్పోయిన బాధ కలుగుతుందాని కొండమ్మ కుటుంబాన్ని అండగా ఉంటామని ఏ సమస్య ఉన్నా తమ ద్రుష్టికి తీసుకు రావాలని టీడీపీ పార్టీ అండగా ఉంటుందని దైర్యంగా ఉండాలని తోడుగా ఉంటామని మాజీ మంత్రి భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి వేంట అరకువేలి మండల అధ్యక్షులు శెట్టి బాబురావు, అరకు పార్లమెంట్, బాకూరు సర్పంచ్ బాకూరు వెంకటరమణ రాజు, అరకు అసెంబ్లీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి దన్నయిక రమేష్,త్రినాధ్,చట్టు అప్పలరాజు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



