స్పందనలో ఆర్జీదారులకు పూర్తిస్థాయిలో పరిష్కారం.
అమలాపురం అఖండ భూమి వెబ్ న్యూస్ :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్పందన ద్వారా వచ్చే దరఖాస్తుల పరిష్కారంలో పూర్తి స్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ హిమాన్సు శుక్లా రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి వివరించారు.గురువారం ఉదయం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే యస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్నకు చెబుదాం,మహిళా శిశు సంక్షేమం,పాఠశాల విద్య,నాడు నేడు, విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ పై సమీక్షించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ అమలాపురం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్ నుంచి జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా, జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర,జిల్లా రెవెన్యూ అధికారి సి హెచ్ సత్తి బాబు వివిధ జిల్లా అధికారులు పాల్గొన్నారు.జిల్లాల వారీగా జగనన్నకు చెబుదాం స్పందన ఫిర్యాదుల అంశంపై వివిధ జిల్లా కలెక్టర్లతో సమీక్షలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబం ధించిన వాటిపై కలెక్టర్ జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జివి సత్యవాణి కు ఆదేశించారు. అదేవిధంగా వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ సూపర్డెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి ఆదేశించారు.అదేవిధంగా పాఠశాల ల్లో మౌలిక సదుపాయాలు నాడు నేడు పనులు పూర్తి అయ్యేవిధంగా విద్యాశాఖ అధికారులు పనిచేయా లని కలెక్టర్ పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమం లో, డి ఆర్ డి ఏ ప్రాజెక్టు డైరెక్టర్ శివశంకర్ ప్రసాద్,డ్వామా పీడీ మధుసూధన్, జి యస్ డబ్లూ యస్ నోడల్ ఆఫీసర్ భీమేశ్వర్ వివిధ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.



