అమలాపురం అఖండ భూమి వెబ్ న్యూస్ :
అమలాపురంలో మంగళవారం జరిగిన ఆటో కార్మిక సోదరుడు శ్రీరాములు అమలాపురం ఆర్టీసీ బస్టాండ్ నుండి నల్ల వంతెన వద్దకు వెళుతుండగా గడియార స్తంభం కార్నర్ లో పాసెంజర్ ఆటో ఆపగా కాట్రేనికోన మండలానికి చెందిన పాలెపు శ్రీరాములు ఆటో పాసింజర్ ను ఎక్కించుకునే సమయంలో పోలీసు వారిని పట్టించుకోకుండా ఆపడం జరిగిందని ఆ సమయంలో టౌన్ ఏ ఎస్ ఐ ఆటో ఆపి ఇక్కడ నో పార్కింగ్ ఇక్కడ ఆపకూడదు నీ రికార్డు తీసుకురా అని చెప్పగా ఆటో కార్మికుడైనటువంటి శ్రీరాములు ట్రాఫిక్ అవగాహన లేక ఆటోలో రికార్డు లేకపోవడంతో భయపడి బతిమాలడం జరిగిందని ఆ సమయంలో ఏ ఎస్ ఐ పోలీస్ స్టేషన్ లో ఆటో పెట్టి పైనేస్తామని అందరికీ మాదిరిగా అతనికి చెప్పడం జరిగిందని ఈ విషయం సోషల్ మీడియా వారు మీడియా లో కూడా అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేయడం జరిగిందని అది చూసి జిల్లా ఆటో యూనియన్ 24 మే 23, సాయంత్రం ఐదు గంటలకు పాలెపు శ్రీరాముని పిలిచి ఏం జరిగిందని అడగగా నాకు అవగాహన లేకపోవడం వల్ల ఆ క్షణంలో అలా జరిగిందని అంతేగాని వేరే విధంగా నాకు ఆలోచన లేదు నేను యధా విదిగా వ్యాపారం చేసుకుంటున్నాను నాకు యూనియన్ నుండి సభ్యత్వం ఇప్పించవలసిందిగా మమ్మల్ని కోరడం జరిగిందని జిల్లా యూనియన్ కమిటీ ఆటో కార్మికులు టౌన్ ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించి, జిల్లా అయినందున పోలీసు వారు ఆటో కార్మికులు వలన ట్రాఫిక్ ఇబ్బందు లు లేకుండా ఆటో కార్మికులకు కౌన్సిలింగ్ ఇచ్చి సక్రమంగా ట్రాఫిక్కు జరిగే విధంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అందరం చూడాల్సిన బాధ్యత మన మీద ఉందని యూనియన్ ప్రతినిధులు మాట్లాడడం జరిగిందిని,ఈ కార్యక్రమానికి జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు వాసంశెట్టి సత్తిరాజు,ప్రధాన కార్యదర్శి ఊటాల వెంకటేష్, ఏఐటీయూసీ నాయకులు బొలిశెట్టి శంకర్,జిల్లా ట్రెజరర్ వాసంశెట్టి శ్రీనివాసరావు, మోకా శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు రావూరి రాంబాబు, బొమ్మి ఫణీంద్ర పాలెపు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.



