విద్యుత్ కోతలను ఆపాలి
భీమవరం మే 25 అఖండ భూమి వెబ్ న్యూస్ :
భీమవరం పట్టణంలో వేలాపాల లేని విద్యుత్ కోతలను అరికట్టాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ ఏరియా విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ టౌన్ కార్యదర్శి బి వాసుదేవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజలపై ట్రూ ఆఫ్ చార్జీలుపేరుతో విద్యుత్ భారాలు వేస్తున్నారని కనీసం న్యాయమైన విద్యుత్తును సప్లై చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు విద్యుత్ కోతల వలన వృద్ధులు చిన్నపిల్లలు ఉక్కపోతకు గురై అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కోతలను నివారించాలని ఆయన డిమాండ్ చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కోత లను అరికట్టి నిరంతరాయంగా విద్యుత్తును సప్లై చేసి ప్రజల ప్రాణాలను ఎండల నుండి కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు లేకుంటే ప్రజల నుసమీకరించి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జక్కం శెట్టిసత్యనారాయణ ఎం వైకుంఠ రావు ఎం ఆంజనేయులు చల్లబోయిన వెంకటేశ్వరరావు యాకాబు తదితరులు పాల్గొన్నారు



