ఘన సన్మానం.

 

 

జిల్లా డిఐపిఆర్ఓ కార్యాలయం సహాయ సంచాలకులు డి.నాగార్జుకు కార్యాలయ సిబ్బంది ఘన సన్మానం.

భీమవరం: మే 25, అఖండ భూమి వెబ్ న్యూస్ :

కష్టించి పని చేస్తేనే ఏ స్థానంలోనైనా మంచి గుర్తింపు వస్తుందని పశ్చిమగోదావరి జిల్లా సమాచార శాఖ అధికారి డి.నాగార్జున అన్నారు.

ఇటీవల డిప్యూటీ డైరెక్టర్ గా పదోన్నతి పొందిన పశ్చిమగోదావరి జిల్లా డిఐపిఆర్ఓ కార్యాలయం సహాయ సంచాలకులు డి.నాగార్జున గురువారం ఉదయం విధుల నుండి విడుదలకావడం జరిగింది. ఈ సందర్భంగా భీమవరం డి ఐ పి ఆర్ ఓ కార్యాలయం సిబ్బంది పదోన్నతి పై డిప్యూటీ డైరెక్టర్ గా కాకినాడ డీఐపిఆర్ఓ కార్యాలయం వెళ్తున్న వెళ్తున్న డి. నాగార్జునకు శాలువా కప్పి సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ కష్టించి పనిచేస్తే వ్యక్తిగత గుర్తింపుతో పాటు, ఉన్నత స్థానాలను అందిపుచ్చుకోగలమన్నారు. తాను పనిచేసిన కాలంలో సహాయ, సహకారాలు అందించిన సిబ్బంది అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ టి. నాగేశ్వరరావు, ఎఇఐఇ ఎన్. వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ కెటిఎమ్ కె సత్యనారాయణ రాజు, పబ్లిసిటీ అసిస్టెంట్ సిహెచ్ శ్రీనివాస్ నెహ్రూ, టైపిస్ట్ కె.జ్యోతి, జూనియర్ అసిస్టెంట్ పి.ఎన్ రవి, వీడియో గ్రాఫర్ పి.వై రత్నాకర్, డ్రైవర్ ఆర్.మల్లి బాబు, రికార్డ్ అసిస్టెంట్ డి. సోమరాజు, రెడ్డి వైశాలి పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!