నియోజకవర్గంలో పేదలందరికీ పక్క గృహ నిర్మాణాలు

 

 

 

నియోజకవర్గంలో పేదలందరికీ పక్క గృహ నిర్మాణాలు

-విస్సాకోడేరు లేఔట్ లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

భీమవరం మే 25 అఖండ భూమి వెబ్ న్యూస్ :

నియోజవర్గంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని భీమవరం

ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.. విస్సా కోడేరు లేఔట్ లో మూడు కోట్ల 69 లక్షల నిధులతో నిర్మించనున్న రోడ్ల పనులకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయలం, చిన అమిరం గ్రామాలకు సంబంధించిన పేదలకు ఈ లే అవుట్ లో 107 ఎకరాల భూమిని సేకరించడం జరిగిందని, మూడువేల 434 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. వీటిలో దాదాపుగా 1800 మందికి పైగానే గృహ నిర్మాణాలు చేపట్టారని, కొంతమంది గృహాలను నిర్మించుకుని గృహప్రవేశాలు కూడా చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ లేఔట్ లో విద్యుత్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలో విద్యుత్ సబ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ లేఔట్ లో లబ్ధిదారుల గృహ నిర్మాణాల కోసం సుమారుగా 500 మంది వర్కర్స్, హౌసింగ్, మున్సిపల్ అధికారులు పనిచేస్తున్నారని, లబ్ధిదారుల గృహాలను నిర్మిస్తున్న కాంట్రాక్టర్ పళ్ల ఏసుబాబును ఈ సందర్భంగా అభినందిస్తున్నానని, గతంలో కూడా తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడేరు రోడ్లో 700 వరకు వ్యక్తిగత గృహాలను ఆనాడు ఏసుబాబు చేత నిర్మించడం జరిగిందన్నారు.

అనంతరం లేఔట్ లో గృహం నిర్మించుకుని గృహప్రవేశం చేసిన లబ్ధిదారులు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను ఇంటికి స్వయంగా ఆహ్వానించడంతో ఆయన వెళ్ళారు. ఇంట్లోకి ప్రవేశించిన ఆయన ఇంటిని మొత్తం పరిశీలించి ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు.ఆ కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకుని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తోట భోగయ్య, గాదిరాజు సుబ్బరాజు, పల్లా ఏసుబాబు,, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, ఏ ఎస్ రాజు,చెల్లా బోయిన సూర్యప్రకాష్ రావు,, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!