పశ్చిమగోదావరి జిల్లా ఐ అండ్ పిఆర్

ఏడి దాసరి నాగార్జునకు ఏపీయూడబ్ల్యూజే అభినందన సత్కారం
భీమవరం మే 25( అఖండ భూమి వెబ్ న్యూస్ :
పశ్చిమగోదావరి జిల్లా ఐ అండ్ పి ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న దాసరి నాగార్జున డిప్యూటీ డైరెక్టర్ గా పదోన్నతి పై కాకినాడ వెళుతున్న సందర్భంగా గురువారం నాడు జిల్లా కలెక్టరేట్లో ఏపీయూడబ్ల్యూజే( ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్) తరపున అభినందన సత్కారం నిర్వహించారు… ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఎస్ సాయిబాబా మాట్లాడుతూ పశ్చిమగోదావరి కొత్త జిల్లాగా ప్రారంభమైన తరువాత సమాచార శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తూ మీడియా ప్రతినిధులతో చక్కటి సన్నిహిత సంబం దాలు నెరిపి వివాదరహితులుగా నిలిచారని పేర్కొన్నారు… ఈ సందర్భంగా ఆయనను కె.వి ప్రసాద్, యర్రంశెట్టి గిరిజాపతి ,టీవీ9 శ్రీనివాస్, ఏబీఎన్ వర్మ తదితరులు చేతుల మీదుగా శాలువా కప్పి సత్కరించారు.. బోనం శ్రీనివాసు..సాయిబాబా, నూకల సత్యనారాయణ తదితరులు బొకే అందజేశారు… అందరి చేతుల మీదుగా మెమెంటు బహుకరించారు.. ఈ కార్యక్రమంలో బొక్కా రామాంజనేయులు తిరుమల ప్రసాద్, కొట్టు మధు భాస్కర్, గుత్తుల సూర్య, రాజేంద్ర, కృష్ణ, వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు… తన హయాంలో భీమవరం మీడియా అందించిన సహకారం మరువరాని దని నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు…


