కారాగారం లో ఉన్న ఉన్న ఖైదీలు ఉచిత న్యాయ సేవలు ఉపయోగించుకోవాలి 

 

 

కారాగారం లో ఉన్న ఉన్న ఖైదీలు ఉచిత న్యాయ సేవలు ఉపయోగించుకోవాలి

– న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. రాజేశ్వరి.

భీమవరం ఏలూరు మే 25 అఖండ భూమి వెబ్ న్యూస్

రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. రాజేశ్వరి జిల్లా కరాగారాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని, అలాగే ఖైదీల కుటుంబ సభ్యులకు ప్రభుత్వా పధకాలను పొందడంలో కాని,

ఏ విధమైన న్యాయపరమైన సలహాలు కానీ సహాయం అవసరం అయిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. అలాగే జిల్లాలో కరాగారంలో ఉన్న ఖైదీలకు అందిస్తున్న ఆహార, వైద్య సదుపాయాలు, వారి యొక్క కేసు వివరాలు, న్యాయవాది వివరాలు తెలుసుకున్నారు. ఎవరికైనా అవసరమైన పక్షంలో ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని, మరియు ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మునేశ్వరరావు జిల్లా జైలర్స్ వెంకట్ రెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!